రాజోళిలో ఇప్పుడు మగ్గాల శబ్దాలు ఆగిపోయాయి. నేతన్నల హృదయాలు పగిలిపోయాయి. ప్రపంచానికి బట్టలందించే నేతన్నలు నేడు దాతలందించిన పాత బట్టలు మూటల్లో వెతుక్కొని కొలతలు చేసుకొని వేసుకుంటున్నారు. ఎవరేమైనా బయటి నుంచి ఏదైనా ఇస్తారేమోనని రచ్చకట్ట దగ్గర వచ్చిపోయే వాహనాల వెంబడి ఆశగా ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నారు.
పాలమూరు జిల్లాలో చేనేతకు పెట్టింది పేరు గద్వాల చీరలు, అలాగే నారాయణపేట చీరలు. ఈ రెండు ప్రాంతాలకు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఈ చీరలను నేస్తున్న గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేత పనిని ఈ జిల్లాలో పద్మశాలి, కుర్ణిసాలి, పట్టు సాలీలు అలాగే ఇతర కూలీలైన కత్రిలు, ముస్లింలు చేస్తున్నారు. ఈ గద్వాల చేనేత క్లస్టర్‌లో చేనేతకు ప్రాముఖ్యమున్న గ్రామం రాజోళి. తుంగభద్ర నది తీరంలో ఉన్న ఈ గ్రామం దాదాపు 50 శాతంపైగా కుటుంబాలు చేనేతపై జీవిస్తున్నాయి. గత పదిహేనేళ్ల క్రితం వరకు కాటన్ దుప్పట్లు, లుంగీలు, తువ్వా లు, పంచెలకు పెట్టింది పేరు. ‘రాజోళి బట్టలు’ అనే బ్రాండ్ పేరుతో వీరి వ్యాపారం సాగుతుండేది.
కాని మారుతున్న కాలంతో పాటు నేత బట్టకు ఉన్న డిమాండ్ పడిపోవడం వల్ల వీరు గద్వాల్ పట్టు చీరలు నేయడం మొదలుపెట్టారు. అదృష్టం బాగుండి మార్కెట్ ఉండడం వల్ల వీళ్ళంతా ఈ నేత పనిచేస్తూ జీవనం సాఫీగా సాగిస్తుండే వారు. గత 5-6 సంవత్సరాల నుంచి వారి పిల్లలను పై చదువులకు పంపిస్తున్నారు. జీవితం కంకర రోడ్డుపై వెళుతున్న ఎడ్ల బండిలాగా సాగుతుండేది. దసరా సరదాగా ఉన్నంతలో పండగ చేసుకున్న సంతోషాన్ని, భవిష్యత్తు కలలను గంగమ్మ ఒక్క పెట్టున ఉప్పొంగి కళ్ళ ముందే గ్రామాన్ని నీట ముంచింది.
బతుకులను ప్రశ్నార్థకంగా మార్చింది. తుంగభద్ర నది పొంగి పొర్లింది. సంకేసు ల డ్యాం నిండి గేట్లు తెరుచుకోలేక హోస్పే ట్ నుంచి వచ్చిన వరద నీరు బయటికి పంపలేక నిర్దాక్షిణ్యంగా తన ఒడిలో సేద తీరుతున్న రాజోళి గ్రామాన్ని క్షమించండంటూ ముంచెత్తేసింది. ప్రాణ నష్టం అంతగా లేకున్నా డ్యాం తెగి ఊరుమీద పడ్డ తుంగభద్ర తన మన పేద ధనిక వర్గ వర్ణ కుల విభేదాలు లేకుండా అందరిని సమానంగా చూసింది. ఫలితం గూడు చెదిరింది. మగ్గం విరిగింది. ఆధారమైన దారం తెగింది. భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది.
నిన్నటి వరకు బతుకు జీవుడా అన్న చందాన ఉన్న జీవితాలు నేడు కకావికలమై గుట్టకొకరు, గట్టుకొకరు, చెట్టు నీడ కొకరు అందిన సామాన్లు తీసుకొని బయలు దేరారు. రాజోళిలో ఇప్పుడు మగ్గాల శబ్దాలు ఆగిపోయాయి. నేతన్నల హృదయాలు పగిలిపోయాయి. ప్రపంచానికి బట్టలందించే నేతన్నలు నేడు దాతలందించిన పాత బట్ట లు మూటల్లో వెతుక్కొని కొలతలు చేసుకొని వేసుకుంటున్నారు. ఎవరేమైనా బయటి నుంచి ఏదైనా ఇస్తారేమోనని రచ్చకట్ట దగ్గర వచ్చిపోయే వాహనాల వెంబడి ఆశగా ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నారు.
ఇంటి పరిస్థితి చూస్తే పగిలిపోతుంది. జీవనం అందించిన మగ్గం నిర్జీవంగా బురదలో కూరుకొనిపోయింది. కూలిన మిద్దెలు కాలిన కడుపులు కళ్ళలో సుళ్లు తిరుగుతున్న నీళ్లు ఇవన్ని చూసి చూసి మన సు నిబ్బరపరుచుకున్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు. చాలా మంది వస్తున్నారు. వారికి తోచిన సహాయం ఇచ్చి వెళుతున్నారు. ఊరు జాతరను తలపిస్తుంది. జాతర వెనుక నరక యాతన దాగి ఉంది. ఈ గ్రామంలో దాదాపు 1200 పైచిలుకు కుటుంబాలు నేతపై ఆధారపడి ఉన్నాయి. వీరి సంవత్సర ఆదాయము 36 వేల నుంచి 40 వేల రూపాయలు సిల్క్ నేసే వారికి, 24 వేల నుంచి 30 వేల రూపాయల వర కు కాటన్ నేసే వారికి వస్తుండే ది.
ఒక ఇంట్లో ఇద్దరు భార్య, భర్త కష్టపడితే ఒక మగ్గానికి వచ్చే ఆదాయం. వీరికి ఇదే జీవనోపాధి. అన్ని చోట్ల ఉన్నట్టు వీరికి ఇది ఒక్కటే జీవనోపాధి. వ్యవసాయం కాని ఇతర ఉపాధి మార్గాలు శూన్యం అని చెప్పవచ్చు. దీనికి తోడు వీరికి పెట్టుబడి, మార్కెట్ ఒక పెద్ద సమస్యలు. ఈ సమస్యలను అదునుగా చేసుకుని వీరిలో నుంచే కొంత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న వ్యక్తులు మధ్య వర్తులుగా మారి కొంత మందికి మాల్ ఇచ్చి నేయించుకుంటారు. ఈ మధ్య వ్యక్తుల్లో రెండు రకాలు. కొంత మంది నేరుగా మార్కెట్ చేస్తే ఇంకొందరు హోల్‌సేల్‌కు షాపులకు అందిస్తుంటారు.
నేత కార్మికులను చూస్తే కొంత వారి సొంత మగ్గాలు ఉండి షావుకారితో మాల్ తెచ్చుకొని అతనికే ఇవ్వడం దానికి అతనికి చీరకు కొంత ముట్ట చెబుతుంటారు. రెండవ రకం మగ్గాలు వారి సొంతం కావు ఎవరైతే మధ్యవర్తి ఉంటా రో అతనే మగ్గాలు పెట్టి కూలి నేతన్నతో నేయిస్తుంటారు. అంటే కూలి నేతన్న. మూడవ రకం నేతన్న మగ్గం. మాల్ సొంతంగా ఉండి నేరు గా షాప్‌కు గాని లేదా మధ్యవర్తికి గాని ఇస్తుంటారు. వీరు కొంచెం మేలుగా జీవిస్తుంటారు. వీరిలో ఉన్న నైపుణ్యాలను పెట్టుబడిని బట్టి వారు పై నాలుగు రకాలుగా విడగొట్టవచ్చు.
ఒకటి కూలి నేతన్న. రెండు మధ్యవర్తులకు నేసే వారు. మూడవిది సొంతంగా చేసేవారు. నాలుగు మాస్టర్ వీవర్స్ (వ్యాపారం చేసేవారు). వరద తాకిడికి కూలిన మగ్గాల సంఖ్య దాదాపు 2000లకు పై చిలుకే ఉంటుంది. జిల్లా నుంచి అధికారులు గ్రామానికి వెళ్ళి దాదా పు 13 కోట్ల రూపాయల నష్టంగా అంచనా వేశారు. ఇందులో మగ్గా లు, వాటిపై ఉన్న మాల్ (12 నుంచి 15 వేల రూపాయలు మగ్గానికి, 9నుంచి 10 వేల రూపాయలు మాల్‌కు) సహకార సంఘంలో ఉన్న సరుకులు కలిపి అంచనా వేయడం జరిగింది. తాత్కాలికంగా రకరకాల రిలీఫ్ మెటీరియల్‌తో ఆదుకోవడం జరుగుతుంది. దీంతో పాటు దీర్ఘకాలికంగా శాశ్వతమైన నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
రాజోళి నేతన్నలు ఇప్పుడు సర్వస్వం కోల్పోయారు. ఇల్లు కట్టుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్లు కల్పించి మగ్గాలు వాటిపైకి మాల్ అందిస్తే నేత వేసుకొంటారు. శాశ్వతమైన పునరావాసం వైపు వారిని తీసుకెళ్ళవచ్చు. ప్రభుత్వం వీరిని ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన వీరికి తాత్కాలిక షెడ్లు కల్పిస్తూ మగ్గాలు ఇవ్వాలి. మగ్గాలపై మాల్ కొనుగోలు కు రుణసదుపాయం కల్పించడం, వీరికి కనీ సం మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలి. శాశ్వత ప్రణాళికలో భాగంగా ఇల్లు, వర్క్ షెడ్ నిర్మాణం చేపట్టాలి. చేనేతపై పని చేస్తున్న ఇతర సంస్థలతో కలిసి సంపూర్ణమైన శాశ్వత పునరావాసం, జీవనోపాదులను మెరుగుపరిచే ప్రణాళికలు తయారు చేయడం.ప్రభుత్వం/ఇతర సంస్థలు రాజోళి చేనేతకు విస్తృత ప్రచారం కల్పించడం.
రకరకాలైన ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు సమన్వయం చేసుకొని సంపూర్ణ ప్రణాళిక ఎవరెవరు ఏం సహాయం చేయగలరన్నది జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ‘మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు’ దీన స్థితుల్లో ఉన్న నేతన్నలు వరదలలో మునిగి ఉన్నారు. అందరు వారి శాశ్వత పరిష్కారాల గురించి ఆలోచించి ప్రజల సహకారంతో ప్రణాళికలు అమ లు చేస్తే కనీసం పూర్వ స్థితికి తీసుకొని రావచ్చు. ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటిని కావల్సిన స్థాయిలో వాడుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అందరం సహకరిద్దాం.
-వి. మురళీధర్
ఫ్రెండ్స్ ఆఫ్ పాలమూరు
source : aandhrajyothy, 29 Oct 2009



