170 upper primary schools in Medak to be closed

(ఆన్‌లైన్‌ ప్రతినిధి, సంగారెడ్డి) ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 170 అప్పర్ర్‌పైమరీ స్కూళ్లను మూసివేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఈ స్కూళ్ల మూసివేతకు కారణమవుతున్నది. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 230 అప్పర్ర్‌పైమరీ స్కూళ్లలో ఆరోతరగతిలో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన ప్రారంభిస్తున్న విద్యాశాఖ 170 స్కూళ్లను మూసివేస్తున్నది. జిల్లాలో 570 అప్పర్ర్‌పైమరీ స్కూళ్లు ఉన్నాయి.

ఆరో తరగతిలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మేరకు ఆరోతరగతిలో అరవై మంది విద్యార్థులకన్నా ఎక్కువ మంది ఉండి ప్రారంభించే రెండో సెక్షన్‌లో కచ్చితంగా ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన కావించాలి. ఇందుకు అన్ని అప్పర్ర్‌పైమరీ స్కూళ్లలో ఆరో తరగతిలో అరవై మందికన్నా ఎక్కువ విద్యార్థులుండే పరిస్థితి లేదు. దాంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పర్ర్‌పైమరీ స్కూళ్లలోని ఆరు, ఏడు తరగతులను మరో అప్పర్ర్‌పైమరీ స్కూలులో విలీనం చేశారు. ఆ రకంగా 170 ప్రాంతాలలోని అప్పర్ర్‌పైమరీ స్కూళ్లు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మూతపడుతున్నాయి.

ఆ ప్రాంతాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉండి సెంట్రల్‌ ్రపైమరీ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం విలీనం అయిన 170 అప్పర్ర్‌పైమరీ స్కూళ్లతో పాటు అదనపు సెక్షన్లు ప్రారంభిస్తున్న మరో 60 అప్పర్ర్‌పైమరీ స్కూళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియం మొదలవుతున్నది. ఈ విషయాన్ని ఇన్‌చార్జి డీఈవో, హైదరాబాద్‌ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ధృవీకరించారు. ఆరో తరగతిలో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన కావించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లందరికీ రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు.

అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు కూడా ఈ నెల రెడో తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలయితే ఏ టీచర్‌ ఏ ప్రాంతానికి వెళతారో తెలియదు కనుక ముందు చూపుతో ఇలా జిల్లాలోని అన్ని పాఠశాలల టీచర్లకు ఇంగ్లీషు మీడియం బోధన గురించి శిక్షణ ఇస్తున్నారు. టీచర్లకు శిక్షణ విషయం పక్కన పెడితే ఒక్కసారిగా ఆరో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన కావిస్తే విద్యార్థులు రాణిస్తారా అన్న సందేహం వ్యక్తమవుతున్నది. కాన్వెంట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న నిర్ణయం మంచిదే. అయినా ఇలా మధ్యంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్డడంపై తల్లిదండ్రులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయిదో తరగతి వరకు తెలుగుమీడియంలో విద్యాభ్యాసం కావించిన విద్యార్థి ఆరో తరగతిలో ఇంగ్లీషుమీడియంలో చేరితో అవగాహన కలుగుతుందా? శిక్షణ పొందిన టీచర్ల బోధన విద్యార్థులను ఆకట్టుకుంటుందా? కాన్వెంట్‌ స్కూళ్ల విద్యార్థులకు సరిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతారా? అన్న ప్రశ్నలకు టీచర్ల నుంచే సరైన సమాధానం రావడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన విద్యార్థులకు ఎటువంటి ఫలితాలనిస్తుందో చూడాల్సిందే.

source : aandhrajyothy Medak edition 10 june 2008

No Comments Yet

No comments yet.

Comments RSS TrackBack Identifier URI

Leave a comment