నాగరికతకు మానని గాయం
బాలకార్మిక వ్యవస్థకు మూలకారణమైన పేదరికాన్ని నిర్మూలించనప్పుడు చట్టాలు ఎన్నిచేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వివిధ సంస్థలపై అధికారులు దాడులు చేసి, బాలకార్మికులను విముక్తిచేయడం, వారు మళ్ళీ ఎక్కడోక్కడ పనిలో చేరుతుండటం మనకు కనిపిస్తున్నదే. ప్రపంచం మొత్తంమీద 24కోట్ల పైచిలుకు బాలకార్మికులున్నారు.
బాలబాలికలు తల్లిదండ్రుల సంరక్షణలో కేరింతలు కొడుతూ సుఖం గా జీవించాల్సిన వయసులో బాలకార్మికులుగా వెట్టిచాకిరీలో మగ్గుతుండటం సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఈ దుస్థితినుంచి పిల్లలను విముక్తిచేయడానికి 1986నాటి చట్టానికి తాజాసవరణ ద్వారా బాలకార్మి క చట్టం-2006 అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పిల్లలను ఇళ్ళలో నూ, ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు, దుకాణాలు, రిసార్టులు వంటి చోట్ల పనికిపెట్టుకోవడం నేరం.
ప్రమాదకరమైన పనుల్లో బాలకార్మికులను పెట్టుకోవడం ఇప్పటికే నిషేధంలో ఉన్నది. చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన కారణంగా ఉపాధికోల్పోయే 13లక్షలమంది పిల్లలకు పునరావాస ప్యాకేజీలు ఏమీ రూపొందించకపోవడం. అందువల్ల అప్పట్లోనే ఈ చట్టం అమలుపై అనుమానాలు ఏర్పడ్డాయి.
ఇక, ఈ చట్టం ప్రకారం 14 ఏళ్ళలోపువారే బాలకార్మికులు కనుక వారితో పనిచేయించకూడదు. మరి, చట్టప్రకారం 18 ఏళ్లు నిండినవారే వయోజనులు! మరి ఈ రెండు వయోపరిమితులకూ మధ్య ఉన్నవారిని ఏమనిపిలవాలి? బాలలా, వయోజనులా? 14 ఏళ్లు నిండాయి కాబట్టి వారిని వయోజనులుగా భావించి పనిలో పెట్టుకోవచ్చునా? లేక 18 సంవత్సరాలలోపు కాబట్టి వారు వయోజనులు కారు కనుక వారితో పనిచేయించడాన్ని నిషేధిస్తుందా? ప్రభుత్వం చేసే చట్టాలు లోపభూయిష్టమైతే ఆచరణ లో ఇంకెన్ని అవకతవకలుంటాయో ఊహకందని విషయం.
బాలకార్మిక వ్యవస్థకు మూలకారణమైన పేదరికా న్ని నిర్మూలించనప్పుడు చట్టాలు ఎన్నిచేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వివిధ సంస్థలపై అధికారులు దాడులు చేసి, బాలకార్మికులను విముక్తిచేయడం, వారు మళ్ళీ ఎక్కడోక్కడ పనిలో చేరుతుండటం మనకు కనిపిస్తున్నదే. ఈ సమస్య కేవలం మనదేశానికి మాత్ర మే చెందినది కాదు. ప్రపంచం మొత్తంమీద 24కోట్ల పైచిలుకు బాలకార్మికులున్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు బాలకార్మికుడు. ప్రతి ఏటా పనిసంబంధిత ప్రమాదాల్లో పాతికవేలమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం లో 14 ఏళ్లలోపువారు 12.70 కోట్లమంది ఉన్నట్టు అంచనా.
బాలకార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో ఉన్నందున వారి పనికీ, ప్రాణానికీ కూడా భద్రత లేకుండా పోతున్నది. దేశ రాజధానిలో 5లక్షలమంది బాలకార్మికుల్లో యాభైవేలమంది ఇంటిపనివారిగా వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. 1924లో జెనీ ప్రకటన మూల్గం పిల్లల ప్రత్యేక సంరక్షణ విషయంలో ప్రపంచదేశాలు శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించాయి. 1959లో ఐక్యరాజ్యసమితి సర్వసాధారణ సభ బాలల హక్కులపై ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. 1974లో భారత ప్రభుత్వం బాలలపట్ల ఉన్న రాజ్యాంగ బాధ్యతలను పునరుద్ఘాటించింది. 1990లో బాలల హక్కుల ఒప్పందాన్ని అంగీకరించింది.
1992 లో జాతీయ కార్యాచరణ ప్రణాళికనొకదానిని ప్రభుత్వం ఆమోదించింది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ, రాజ్యాంగపరంగానూ వివిధ వాగ్దానాలు, శాసనాలతో పాటు గత ఏడు దశాబ్దాలుగా బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్నప్పటికీ బాల పరిస్థితి, బాలకార్మికుల దుస్థితి హృదయవిదారకంగా ఉంది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం అనేక సామాజికార్థికాంశాలతో ముడివడినది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలు, పేదరికం, అధికసంతానం, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు మొదలైనవన్నీ బాలకార్మిక వ్యవస్థకు మూలకారణాలే. అందువల్ల, ప్రజల్లో వివిధ అంశాలపై చైత న్యం కలిగించడం ముఖ్యం.
సమాజానికి బాలకార్మిక సమ స్య పట్ల అవగాహన కలిగించడంతో పాటు, దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయాన్ని కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు జరపాలి. వివిధ చట్టాల మధ్య ఉన్న విభేదాలను, తేడాలను సవరించడం ద్వారా ఆచరణకు యోగ్యమైన విధానాన్ని రూపొందించుకోవచ్చు. ఈ నేపథ్యంలో, చట్టాలను ఉల్లం ఘించిన యాజమాన్యాలను జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన కారాగారశిక్షలను విధించినప్పుడు బాలకార్మిక వ్యవస్థ అంతం చేయడం సాధ్యపడుతుంది.
- ఎ.వి.రాజా
(నేడు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం)
source : aandhrajyothy 12 June 2008
No Comments Yet
No comments yet.
Comments RSS TrackBack Identifier URI
Leave a comment



