హైదరాబాద్, జూలై 2 : రాజీవ్ విద్యామిషన్ వర్షం ఉరుములేని పిడుగులాగా వర్షాకాలం లో పాఠశాలలకు శాశ్వత ప్రాతిపదికన గూళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇంకేముంది ఆలోచన వచ్చిందే తడవుగా 150 దాకా పాఠశాలల భవ నాలు కూలగొట్టాలని ఆ శాఖ మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. నగరంలో 160 పాఠశాలలకు భవనాలు నిర్మిం చాలని నిర్ణయించిన ఆ శాఖ టెండ ర్లను పిలుస్తోంది. కాంట్రాక్టర్లు ముం దుకు రాకుండానే పాఠశాలల భవనాలు కూలగొట్టాలని నిర్ణయించడం ఇందు లో విశేషం. రెండేళ్ల కిందట కంటో న్మెంట్ పరిధిలో 10 పాఠశాలలకు హడావుడిగా భవనాలు కూలగొట్టిన ఆ శాఖ ఇప్పటిదాకా ఒక్క భవనాన్ని పూర్తి చేయలేదు. 160 పాఠశాలలకు సొంత భవనాల కోసం రూ.65 కోట్లు, 110 పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం కోసం రూ.13 కోట్లు, 140 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3.5 కోట్లతో అంచనాలు రూపొందించింది.
తలదాచుకునేదెక్కడ?
ఒకేసారి 160 పాఠశాలలకు భవ నాలు కట్టాలని హడావుడిగా నిర్ణయం తీసుకోవడం, వీటి కోసం 150 దాకా పాఠశాలల భవనాలు కూలగొట్టాలని నిర్ణయించడంతో అందులో చదువుకుం టున్న వారిని ఏ పాఠశాలకు తరలిం చాలో తెలియక ఉపాధ్యాయులు తల లు బాదుకుంటున్నారు. అసలే భవ నాలు లేక ఇబ్బందులు పడుతున్న వి ద్యార్థులు సొంతగూళ్లు వస్తున్నందుకు సంతోషపడాలో, ఉన్న గూళ్లు ఊడిపో తున్నందుకు ఏడ్వాలో తెలియని గంద రగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆరునూరైనా పాఠశాలల భవనాలను కడతామని ఆర్వీఎం స్పష్టం చేస్తోంది.
సమస్యలు తీరేనా?
ఇప్పటికే నగరంలో మూడో వంతు పాఠశాలలు మూసివేయడంతో ఉన్న పాఠశాలలకు పూర్తిస్థాయిలో భవనాలు సమకూర్చవచ్చనేది ఆర్వీఎం మనోగతం. ఇందులో భాగంగానే కలె క్టర్ పర్యటనలను ఆధారం చేసుకొని, ఆ శాఖ ప్రణాళికలు రూపొందించింది. పాత ప్రణాళికలను బుట్టదాఖలు చేసిం ది. అయితే గతంలో ఇదే స్థాయిలో అంచనాలు, ప్రణాళికలు రూపొందిం చి, ముందుకెళ్లిన ఈ శాఖ, ఆచరణలో బోల్తాపడిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్‌లోని పాఠశాలల భవనాలే ఆర్వీఎం నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఏకంగా 10 పాఠశాలలకు చెందిన పాత భవనాలను ఈ శాఖ కూలగొ ట్టింది. పనిలో పనిగా పనులు ప్రారం భించినప్పటికీ ఒక్క భవనం కూడా నిర్మించలేదు. దాంతో విద్యార్థులకు వర్షాకాలం చదువులే దిక్కయ్యాయి.
ప్రత్యామ్నాయం కల్పిస్తాం – ఆర్వీఎం
పాఠశాలల భవనాల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్ట నుండటంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నా య చర్యలు తీసుకుంటామని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. కాలేజీలు, సమీపం లోని స్కూళ్లకు విద్యార్థులను తరలి స్తామని వెల్లడించారు.
source : aandhrajyothy 2 july 2008
No Comments Yet
No comments yet.
Comments RSS TrackBack Identifier URI
Leave a comment



