హైదరాబాద్, జూలై 3 : ఆ పాఠశాల స్థలం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటి దాకా ఉంటుంది. పేదలకు విద్యనందించడానికి 50 ఏళ్లకిందట ఓ దాత పాఠశాలకు ఈ స్థలాన్ని ఇచ్చినట్లు స్థానికులు చెబుతారు. దీనిపై వాస్తవాలు తేటతెల్లంకాకుండానే వివాదస్పద స్థలాన్ని పరుల చేతిలో పెట్టేసింది విద్యాశాఖ. అదే ఖైరతాబాద్ జాగీర్దార్‌బాడలోని పాఠశాలలు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ ఆదేశాలతో ఆ రెండు పాఠశాలలు చెల్లాచెదు రయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులు చేతికందకుండానే సదరు స్థలం తమదని చెబుతున్నవారు కలెక్టర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో పాఠశాల గదులను తమ అధీనంలోకి తీసేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు వీరికి ఉపయుక్తంగా మారాయి. వెరసి రెండు పాఠ శాలల మనుగడ ఆగమ్యగోచరంగా మారింది. విలీనం అనే జూదంలో బలైన రెండు పాఠశాలల కథ ఇది…
రెండు పాఠశాలలు, రెండే గదులు.. ఆరుగురు ఉపాధ్యాయులు
ఖైరతాబాద్‌లోని జాగీర్దార్‌బాడలో మార్చిదాకా రెండు పాఠశాలలు నడిచేవి. ఒకటి ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల(తెలుగుమీడియం), మరొకటి ప్రభుత్వ బాలుర ఎలి మెంటరీ పాఠశాల ఉర్దూమీడియం. సక్సెస్ పథకం కింద యూపీ ఎస్‌లోని 6,7 తరగతులను వాసవీ ప్రాక్టీసింగ్ పాఠశాలకు తర లించగా, ఇందులోని ఉపాధ్యాయులను ఎర్రమంజిల్‌లోని ఉన్నత పాఠశాలకు మార్చారు. చివరగా యూపీఎస్ రద్దు కావడంతో మిగిలిన ప్రాథమిక పాఠశా లను ఖైరతా బాద్ వాసవీ ప్రాక్టీసింగ్ పాఠశా లకు తరలించారు. దాంతో పాటు ఇదే ప్రాంగ ణంలో ప్రభుత్వ బాలుర ఎలిమెంటరీ పాఠ శాల(ఉర్దూమాధ్యమం)ను మార్చా రు. రెండు ప్రాథమిక పాఠ శాలలు నిర్వ హించడానికి మూడు గదులను ఈ ప్రాంగణంలో కేటాయిం చారు. ఇందులో ఒక గదిని రెండు పాఠశాలల ఉపాధ్యాయుల కార్యాలయం కోసం విని యో గించుకుంటుండగా, మిగతా రెండు గదుల్లో ఉర్దూ, మరో గదిలో తెలుగు మాధ్యమ పాఠశాల నడుస్తోంది.
ఇలాగేనా కొరత తీర్చేది…
పాఠశాలల విలీనంతో స్కూళ్లకు మహర్దశ లభించనుందని, ఉపాధ్యాయుల కొరత తీరి, విద్యాప్రమాణాలు మెరుగుపడ తాయనే సర్కారీపెద్దల మాటలు అక్షరాలా నిజమయ్యాయని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక గదిలోనే నడుస్తుండగా, ఒక్కో గదికి ముగ్గురు టీచర్లు అందుబాటులో ఉండటం మరో విశేషం. రెండుప్రాథమిక పాఠశాలలు నడుస్తున్న రెండుగదుల్లో కలిపి 30 మంది విద్యా ర్థులుండగా, ప్రతి ఐదుమంది విద్యార్థులకు ఒక్కో టీచర్ ఉన్నారు. విలీనంతో ఉపాధ్యాయుల కొరత తీరిందనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాగీర్దార్‌బాడలో పాఠశాల నడుస్తున్నప్పుడు రెండు స్కూళ్లలో కలిపి 60 మంది విద్యార్థులుండేవారు. పాఠ శాల విలీనంతో సగానికి సంఖ్య తగ్గింది. 30 మందిలో 20 మంది దాకా డ్రాపవు ట్లుండగా మరో 10 మంది ప్రైవేట్ పాఠ శాలల్లో చేరినట్లు తెలిసింది.
ఇటీవలే జరిగిన బడిబాటను స్థానిక ఉపాధ్యా యులు నిర్వహించలేదు. విలీనం సమ స్యతో పిల్లలను పాఠశాలలో చేర్పించ మని పిల్లల తల్లిదండ్రులను అడగా ఇబ్బందికర పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులంటున్నారు. ఇరుకైన ఒక గదిలో ఐదు తరగతులు నడిపించడంతో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారని, పిల్లల ను చేర్పించడానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడి పరిస్థితులు చూసి, వెనుదిరుగుతున్నారని ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
జాగీర్దార్‌బాడకు పాఠశాలను తరలిస్తేనే, రెండు పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలను ‘ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ చేయొద్దు… అవసరమైతే భూసేకరణ చేయండంటూ’ మంత్రి షబ్బీర్‌అలీ ఇచ్చిన ఆదేశాలను జిల్లా యంత్రాంగం పట్టించుకుంటే ఈ పాఠశాలలు బాగుపడే అవకాశముంది.
స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి : పరిరక్షణ కమిటీ
జాగీర్దార్‌బాడలో వివాదస్పద స్థలాన్ని మళ్లీ స్వాధీనం చేసుకో వాలని పాఠశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. విలీనం పేరుతో సర్కారీ స్థలాలను అన్యాక్రాంతం చేయడం, విక్రయించ డానికే ఇలా వ్యవహారించారని ఆక్షేపించింది
source : aandhrajyothy 3 july 2008
No Comments Yet
No comments yet.
Comments RSS TrackBack Identifier URI
Leave a comment



