స్కాలర్‌షిప్‌లపై సామాజిక తనిఖీ!
బీసీ సంక్షేమశాఖ సన్నాహాలు
ప్రయోగాత్మకంగా మూడు కళాశాలల్లో
హైదరాబాద్, న్యూస్‌టుడే; స్కాలర్‌షిప్‌లు, బోధనాఫీజుల చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన సామాజిక తనిఖీ(సోషల్‌ఆడిట్) కార్యక్రమాన్ని ఇకపై స్కాలర్‌షిప్ పథకానికి వర్తిపంచేయనున్నారు. బీసీ సంక్షేమశాఖ మొదటిసారి ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణాభివృద్ధిశాఖ సామాజిక తనిఖీని ప్రవేశపెట్టింది. పథకం అమలులో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించ గలిగింది. ప్రజల సమక్షంలోనే సామాజిక తనిఖీ చేపట్టడంతో ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులైన విద్యార్థులందరికీ కలిపి రూ.1200 కోట్ల మేరకు స్కాలర్‌షిప్‌లు మంజూరుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నప్పుడు లబ్ధిదారులకు అవి సక్రమంగా అందాయో లేదో పరిశీలించడానికి సామాజిక తనిఖీకి ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. బీసీ సంక్షేమశాఖ ముందుగా ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. సామాజిక తనిఖీ బృందాలను ఏర్పాటుచేసే సన్నాహాల్లో ఉంది. ఇప్పటికే ఎంపికచేసిన విద్యార్థులు, బీసీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ పూర్తిచేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని మూడు కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా సమాచారహక్కు చట్టం కింద ఆయా కళాశాలల్లో బీసీ విద్యార్థులకు మంజూరుచేసిన స్కాలర్‌షిప్‌ల వివరాలు తీసుకుంటారు. వివరాలను సామాజిక తనిఖీ బృందం అధ్యయనం చేసిన అనంతరం సంబంధిత కళాశాలలో బహిరంగంగా తనిఖీ కార్యక్రమం చేపడతారు. విద్యార్థులతోపాటు యాజమాన్యాన్ని ఇందులో భాగస్వామ్యం చేస్తారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైతే లోటుపాట్లు సమీక్షించి మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు.
source : eenaadu 12 Jul 2008
Leave a Comment
No comments yet.
Comments RSS TrackBack Identifier URI



