రాజోళిలో ఇప్పుడు మగ్గాల శబ్దాలు ఆగిపోయాయి. నేతన్నల హృదయాలు పగిలిపోయాయి. ప్రపంచానికి బట్టలందించే నేతన్నలు నేడు దాతలందించిన పాత బట్టలు మూటల్లో వెతుక్కొని కొలతలు చేసుకొని వేసుకుంటున్నారు. ఎవరేమైనా బయటి నుంచి ఏదైనా ఇస్తారేమోనని రచ్చకట్ట దగ్గర వచ్చిపోయే వాహనాల వెంబడి ఆశగా ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నారు.
పాలమూరు జిల్లాలో చేనేతకు పెట్టింది పేరు గద్వాల చీరలు, అలాగే నారాయణపేట చీరలు. ఈ రెండు ప్రాంతాలకు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఈ [...]



