పునరావాసంలో గిరిజన వ్యథలు – మేకల రవికుమార్ పోలవరం ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు వన్యప్రాణి అనుమతి మంజూరు చేసింది. జలసంఘం నుంచి ప్రణాళిక సంఘం దాకా అన్ని శాఖలతో మమ అనిపిస్తున్నారు. కేంద్ర గిరిజనశాఖ పునరావాసం కూడా బాగుందని తేల్చేసింది. కానీ అసలు మన్యంలో జరుగుతున్నదేమిటి, పునరావాసం పేరు చెప్పి చేస్తున్నదేమిటి. గిరిజనుల జీవితాలను నడిసంద్రంలో నావలా చేస్తున్నదెవరు?



