CARPED » koya

పోల’వరం’… అరణ్యవాసం!
పునరావాసంలో గిరిజన వ్యథలు

- మేకల రవికుమార్‌

పోలవరం ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు వన్యప్రాణి అనుమతి మంజూరు చేసింది. జలసంఘం నుంచి ప్రణాళిక సంఘం దాకా అన్ని శాఖలతో మమ అనిపిస్తున్నారు. కేంద్ర గిరిజనశాఖ పునరావాసం కూడా బాగుందని తేల్చేసింది. కానీ అసలు మన్యంలో జరుగుతున్నదేమిటి, పునరావాసం పేరు చెప్పి చేస్తున్నదేమిటి. గిరిజనుల జీవితాలను నడిసంద్రంలో నావలా చేస్తున్నదెవరు?

‘మబ్బుల్లో నీటిని చూపి ముంత ఒలకబోసుకోవడం…’ అనే సామెత పోలవరం విషయంలో అక్షరాలా నిజమైంది. ప్రభుత్వం ప్రాజెక్టును చూపి గిరిజనుల జీవితాలను ధారపోస్తోంది. వారి ప్రశాంతతను, భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను మొత్తంగా వారి జీవితాలనే నీటిపాలు చేస్తోంది. ‘పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని అయిదు అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటవుతుంది. 7.20 లక్షల ఎకరాల భూమికి జీవిక అవుతుంది. లక్షల మంది ప్రజలకు జీవనాధారమవుతుంది. విశాఖ వంటి నగరాలకు జీవధార అవుతుంది. నదుల అనుసంధానమనే మహాయజ్ఞానికి ఆది అవుతుంది’… ఇదీ కాగితాలపై ప్రభుత్వం చూపుతున్న భవిష్యత్తు చిత్రం. గోదావరి కాన్వాస్‌పై గీస్తున్న అందమైన ఊహ. ఈ మహా సంకల్పం అభినందించదగ్గదే. కానీ ఇది అవినీతికి ప్రతిరూపంగా మారితే, కచ్చితమైన ప్రణాళికలేని ప్రహసనంగా మారితే… ముఖ్యంగా వేలమంది ప్రజల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా మారితే దాన్నేమనాలి? ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పరిధిలో అదే జరుగుతోంది. ఇందులో అమాయకులైన గిరిజనులు సమిధలవుతున్నారు.

గోడు పట్టని ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టును గోదావరిపై నిర్మిస్తే వేల ఎకరాల భూమి జలాశయగర్భంలో కలిసిపోతుంది. ఇందులో 75 వేల ఎకరాల సాగుభూమితో పాటు, మరింత అటవీ భూమి కూడా ఉంది. 276 గ్రామాలూ కనుమరుగవుతాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం మండలాల్లో ఉన్న 1.75 లక్షల మంది ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. వీరిలో ఎక్కువమంది షెడ్యూల్డు తెగలకు చెందిన గిరిజనులే. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం పునరావాస, పునరుద్ధరణ (ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీని రూపొందించింది. కానీ దీని అమలుతీరు మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ప్రస్తుతం వేలాది గిరిజనుల జీవితాలను గాల్లో దీపంలా మార్చింది. ప్యాకేజీ ప్రకారం గిరిజనులందరికీ పక్కాగా పునరావాసం కల్పించాలి. దీనికోసం ముంపు బాధితుల కోసం గృహవసతి ఏర్పాటు చేయాలి. భూమి కోల్పోయే వారందరికీ కొంత భూమి రూపంలో, మరికొంత ధనం రూపంలో పరిహారం చెల్లించాలి. ఇచ్చిన భూమిని సంస్కరించుకునేందుకు, వ్యవసాయం మొదలు పెట్టడానికి మరికొంత సహాయం అందించాలి. ఉపాధి హామీ కోల్పోయే వారందరికీ లెక్క కట్టి జీవనాధారం ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలకు, భూమిలేని రైతులకు వారు ఉపాధి కోల్పోయే రోజులను అంచనా వేసి దినసరి భత్యాన్ని గ్రాంట్‌గా ముందే ఇచ్చేయాలి. కులవృత్తులు కోల్పోయేవారికీ ఇలాగే ఆర్థిక సహాయం అందించాలి. ఇలా పునరావాసుల కోసం ప్యాకేజీని రూపొందించారు. కానీ వీటి అమలులో మాత్రం అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలాన్నే తీసుకుందాం. ఈ మండలంలో 43 గిరిజన గ్రామాలు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతాయి. ఇక్కడున్న సుమారు 30వేల మందిలో అత్యధికులు షెడ్యూల్డు తెగలకు చెందిన కొండరెడ్లు, కొండదొరలు, కొండకమ్మర్లు. రంపచోడవరం ఐ.టి.డి.ఎ. పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ మొత్తం పూర్తిగా లోపాలమయంగా ఉంది. ఈ మండలంలోని డి.రావిలంక, పరకసానిపాడు, బోడిగూడెం గ్రామాల ప్రజల కోసం 166 గృహాల సముదాయాన్ని ఇందుకూరు సమీపంలో నిర్మించారు. ఇప్పుడక్కడ ఆయా గ్రామాలకు చెందిన 50 కుటుంబాలైనా నివసించడంలేదు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో ఉన్నవారందరూ తమ గూడేల సమీపంలోనే ఉన్న భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకప్పుడు చెట్లు, చేమలతో నిండిన ఈ అటవీ భూములను గిరిజనులు ఎంతో కష్టపడి సాగులోకి తెచ్చుకున్నారు. కొండవాగులను మళ్లించి నీటి వనరులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడా గ్రామస్తులందరినీ పునరావాస కాలనీకి వెళ్లమని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అక్కడకు వెళితే ఉపాధి కోల్పోతామని గిరిజనులు బెంగటిల్లుతున్నారు. దానికి కారణం- ఏమాత్రం వ్యవసాయయోగ్యంకాని భూమిని వారికి కట్టబెట్టారు. రాళ్లు, రప్పలు, తుప్పలతో నిండిన ఆ భూమిలో ఏం పండిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిని ఎలాగైనా పునరావాస కాలనీకి తరలించాలని అధికారులు నిజాలకు మసిపూశారు. గిరిజనులను మాయచేశారు. ఆ సమయంలో అధికారులు వారిని ఎంత తీవ్రంగా మభ్యపెట్టారంటే- ఆ ఇళ్లలోకి మీరు వెళ్లి పాలు పొంగిస్తే చాలని చెప్పారు. అందుకు అవసరమైన పప్పు, బెల్లం, బియ్యం అన్నీ తామే ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. చెప్పినట్లే అధికారులు కాలనీకి వెళ్లిన వారికి వంటసామగ్రి సరఫరా చేశారు. గిరిజనులకు తరలింపు ఖర్చు కింద అయిదువేల రూపాయలు ఇవ్వాలన్నది పునరావాస చట్టం నిబంధన. అయితే వారికి ఇచ్చే ఈ తరలింపు ఖర్చుల్లో రూ.500 చొప్పున పప్పు, బెల్లాల ఖర్చు కూడా జమ చేసేశారు. చివరకు ఆ కాలనీలో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయడానికీ నానాయాతనలు పడాల్సి వచ్చింది. కాలనీ పక్కనున్న ఖాళీ స్థల యజమాని అభ్యంతరంతో శవాలను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు తరలించి అక్కడ దహనం చేయాల్సి వచ్చింది. ఇలాంటి కారణాలతో గిరిజనులకు పునరావాస పథకాలపై నమ్మకం పోయింది. ఆ కాలనీని వదిలిపెట్టి తిరిగి తమ గ్రామాలకు వచ్చేశారు. గోదావరి ముంచేసినా తామిక్కడి నుంచి కదిలేేదంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన 40 గ్రామాల్లోని ప్రజల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. వీరికి భూములిస్తామని, కాలనీ కట్టిస్తామని చెప్పారు. కానీ కాలనీకి స్థలం రంపచోడవరంలో ఉంటే పొలాలను గంగవరం, దేవీపట్నం మండలాల్లో చూపుతున్నారు. వీరి నివాస ప్రాంతానికి, వ్యవసాయ భూములకు మధ్యదూరం 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పైగా ఇందుకూరుపేట కాలనీకి వెళ్లిన బాధితుల అనుభవాలు విని ఉండటంతో గిరిజనులు తాము ఇప్పుడున్న గ్రామాలను ఖాళీ చేసేది లేదంటున్నారు. అధికారులు మాత్రం గ్రామాల్లో ఎలాంటి తీర్మానాలు చేయకుండానే, ప్రజల అనుమతిని తీసుకోకుండానే రేషన్‌షాపుల వంటివాటిని తరలించేశారు. అయినా అక్కడి ప్రజలు తమ గ్రామాలను వదిలేది లేదంటున్నారు. అవసరమైతే పోరుబాట పడతామంటున్నారు. పునరావాసం లోపభూయిష్ఠంగా జరుగుతున్న తీరుకు ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు.

గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలన్నా అక్కడి ప్రజల ముందస్తు అనుమతి తప్పనిసరి అని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ తేల్చి చెప్పింది. గిరిజన ప్రాంతాన్ని కాపాడమని ఆదేశించింది. అవసరమైతే గవర్నర్‌ నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందాలనీ స్పష్టంచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనులు జరుగుతున్న తీరు దీనికి పూర్తిగా విరుద్ధం. ముఖ్యంగా భూముల పంపకం విషయంలో నిబంధనలకు పాతరేస్తున్నారు. సాధారణంగా గిరిజనుల భూములను కొనడం, అమ్మడం నిషిద్ధం. అనివార్యమైతే, అనుమతి తప్పకుండా తీసుకోవాలి. కానీ ఇక్కడ కేటాయింపులన్నీ అడ్డగోలుగా ఉన్నాయి. నయానో, భయానో భూములను సేకరించి అధికారులు ముంపు బాధితులకు కట్టబెట్టేశారు. గిరిజనుల భూములను గిరిజనులకు కేటాయించడంతో ఇప్పుడు వారి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. వ్యవసాయ భూమిని తీసుకుని కొండలపై భూమిని ఇస్తే మళ్లీ పోడు వ్యవసాయానికి తమను మళ్లించినట్లవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజలెవరూ ఈ భూముల జోలికి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఖమ్మం జిల్లాలో అయితే పునరావాసాన్ని ఒక జూదంలా మార్చేశారు. అక్కడ ముందుగా గిరిజనేతరుల భూములకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేశారు. దీన్ని చూసి తమకూ ఇలాగే న్యాయం జరుగుతుందని ఆశపడిన గిరిజనులను మాత్రం తీవ్రంగా దెబ్బకొట్టారు. వారిని గ్రామాలు ఖాళీ చేయించేందుకు సిద్ధం చేసి ప్యాకేజీలోని ఏ లబ్ధినీ వారికి అందించలేదు. చివరకు పునరావాస ప్యాకేజీ విషయంలో వారి అభిప్రాయాలనూ ముందుగా తీసుకోలేదు. భద్రాచలంలో జరిగిన అవగాహన సదస్సులో మైదాన ప్రాంతంలోని అధికార పార్టీ కార్యకర్తలే ఎక్కువమంది కనిపించారు. ఇలా గిరిజనాభిప్రాయానికి ప్రభుత్వం గండికొట్టింది. నిబంధనలను తేలిగ్గా అతిక్రమించేసింది.

అనుమతుల మాటేమిటి?

పోలవరం ప్రాజెక్టు విషయంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ మండలి ఇచ్చిన అనుమతులకు సుప్రీం ఆమోదముద్ర వేసింది. దీంతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం మిగిలిన అనుమతుల గురించి మాట్లాడటం లేదు. కేంద్ర జలసంఘం సూచనప్రాయంగానే అంగీకారం తెలిపింది. ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో వివాదం విషయంలో చర్చలూ ఒక కొలిక్కిరాలేదు. ముంపునకు గురికానున్న వేలాది ఎకరాల అటవీ భూములను గురించి ఇంకా తేల్చాల్సి ఉంది. వీటన్నిటిపై ఇంకా పలు కేసులు కోర్టుల్లో పెండింగుల్లో ఉన్నాయి. అర్ధసత్యాలతో, అసత్యాలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం అసలు ముఖ్యమైన పునరావాసం ప్రక్రియలో పారదర్శకత పాటించడం లేదు. మరోపక్క పలువురు నిపుణులు ప్రాజెక్టు డిజైన్‌పై, నిర్మాణం జరుగుతున్న ప్రాంతంపై, నిర్మాణం జరుగుతున్న తీరుపైనా అభ్యంతరాలు చెబుతున్నారు.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కోసం గిరిపుత్రులు తరతరాలుగా ఉంటున్న ప్రాంతాన్ని, ఉపాధిని, అన్నిటికంటే ముఖ్యంగా తమ సంస్కృతిని, సంప్రదాయాలను ధారపోసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలి. ఈ ప్యాకేజీ విషయంలో నిరక్ష్యరాస్యులైన ప్రజలకు ఏమీ తెలియజెప్పకుండానే, లోటుపాట్లు వివరించకుండానే వారి జీవితాలకు గండికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్వం కోల్పోతున్న వీరికోసం ఉద్దేశించిన పథకాల ప్రయోజనాలూ అందకుండా పోవడం దారుణమైన విషయం. సరైన పునరావాసం కల్పించకుండా, అడవిబిడ్డల ప్రశాంత జీవనానికి తూట్లు పొడుస్తూ ప్రాజెక్టుకు పునాదులు వేస్తే- ప్రభుత్వం విపత్కర పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా సరైన రీతిలో, పారదర్శకంగా పునరావాస ప్రక్రియను కొనసాగిస్తేనే ఈ అరణ్యరోదన తప్పుతుంది!

source : eenaadu 24 sep 2008