ఆదిలాబాద్ జిల్లాప్రతినిధి/ ఏజెన్సీ ప్రభాతవార్త బృందం మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడాలు, గిరిపల్లెలు అంతుబట్టని రోగాలతో తల్లడిల్లుతూ మృత్యు కుహరానికి చేరుకుంటున్నాయి. చావుముంగిట నిలిచి అడవి బిడ్డలు చేస్తున్న ఆహాకారాలు బాహ్య ప్రపంచానికి వినిపించక పోవడం సర్కారు మొద్దునిద్రకు నిదర్శనం. జిల్లాలో ఐదు ఏజెన్సీ మండలాల్లో మూడు నెలల నుంచి గిరిజనులు అంతుబట్టని జ్వరాలతో మరణిస్తున్నారు ీఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 60మందికి పైగా గిరిజనులు విషజ్వరాల బారినపడి మృతి చెందారు. గత సంవత్సరం అంతుబట్టని [...]



