పాత బట్టలకీ ఓ కులముంది * చల్లా శ్రీనివాస్ ఇంట్లో వృథాగా పడివున్న ఇనుపసామాను… విరిగిన ప్లాస్టిక్ వస్తువులు… ఖాళీసీసాలు… చదివేసిన పేపర్లు కొనేందుకు ‘పాత సామాన్లు కొంటాం’ అంటూ కాలనీల్లోకి తరచూ ఎవరో ఒకరు వస్తుంటారు. వాటన్నిట్నీ అమ్మేసి చేతులు దులుపుకుంటాం. మరి…పాతదుస్తులను ఎలా వదిలించుకుంటాం… ‘పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఇస్తాం’ అనే పిలుపువింటేచాలు… కాలనీ మహిళలంతా ఒక్కచోట చేరతారు. తమ ఇంట్లో పాత దుస్తులు (స్టీల్ సామానుపై ఉన్న మోజుతో మగవాళ్ల కొత్త [...]



